Monday, December 5, 2022
Monday, December 5, 2022

కుల గణన చేపట్టాలి : అఖిలేష్‌ యాదవ్‌

కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని, లేకుంటే యూపీలో బీజేపీకి ఓటమి ఖాయమని ఎస్పీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్‌ మాట్లాడుతూ, ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్‌ కోటాపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను తొలగించకుండా.. ఎలా ఓబీసీ బిల్లును పాస్‌ చేస్తారని ప్రశ్నించారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కూర్చోబెట్టేందుకు సెంట్రల్‌ విస్టాను కడుతున్నారని, కానీ ఓబీసీలు.. దళితులు, మైనార్టీలను ఎందుకు 50 శాతం కోటాకే కట్టిపడేస్తున్నారని అడిగారు. కుల గణనను చేపట్టి, ఆ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండు చేశారు. కులం ప్రాతిపదికన జనాభా లెక్కించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ బీ చంద్రశేఖర్‌ కూడా డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img