Friday, August 19, 2022
Friday, August 19, 2022

కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం.. వందలాది పందుల హతం

ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూతో 44 పందుల మృతి
ముందుజాగ్రత్త చర్యగా 685 పందుల హతం

కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌తో రెండు పందుల పెంపకం కేంద్రాల్లోని 44 పందులు మృతి చెందడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను హతమార్చారు. వయనాడ్‌ మునిసిపాలిటీతోపాటు తవింజల్‌ గ్రామంలోని ఐదు ఫామ్‌లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. పందుల యజమానులకు ప్రభుత్వం త్వరలోనే పరిహారం అందిస్తుందని పశుసంవర్థకశాఖలోని డిసీజ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మినీ జోస్‌ తెలిపారు. కాగా, ఈ ఫీవర్‌ గురించి ఆందోళన అవసరం లేదని, ఇది ఇతర జంతువులకు కానీ, మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ రాజేశ్‌ తెలిపారు. ఈ వైరస్‌ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img