Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు


మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
కేరళలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17,18 తేదీల్లో పూర్తి లాక్‌ డౌన్‌ ప్రకటించింది. గత జూన్‌ 12, 13 తేదీల్లో ఏ గైడ్‌ లైన్స్‌ ని జారీ చేశామో..వాటినే ఇప్పుడు కూడా పాటించాలని పేర్కొంది.తాజా గైడ్‌ లైన్స్‌ జులై 15 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కేరళలో నిన్న 14,539 కేసులు నమోదు కాగా-124 మంది రోగులు మరణించారు. టెస్ట్‌ పాజిటివిటీ రేటు 10.46 శాతం ఉంది. గత 24 గంటల్లో లక్షా 39 వేలకు పైగా శాంపిల్స్‌ సేకరించారు. ప్రజలు కోవిడ్‌ ప్రొటొకాల్స్‌ మాత్రం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img