Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

కేరళ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ

కేరళ ముస్లిం లీగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్‌ ఫే˜స్‌బుక్‌లో ఆగస్టు 17వ తేదీన ఓ పోస్టు చేశారు. మానవహక్కులను తాలిబన్లు గౌరవించడం లేదని ఆ పోస్టులో ఆయన ఆరోపించారు. అయితే ఆ కామెంట్‌ను తక్షణమే డిలీట్‌ చేయాలని ఆ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ లేఖ వచ్చింది. బెదిరింపు లేఖకు సంబంధించి సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img