Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

కొనసాగుతున్న ఎంపీల నిరసన,,రాత్రంతా పార్లమెంట్‌ ప్రాంగణలోనే !

సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభలో 20 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసారు. వారి పైన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ విపక్షాలు 50 గంటల నిరసన కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో తమ షరతులకు అంగీకరిస్తేనే విపక్షాలు కోరుతున్నట్లుగా సస్పెన్షన్‌ ఎత్తివేసే అంశం పరిశీలిస్తామని అధికార వర్గం స్పష్టం చేస్తోంది. మంగళవారం రాజ్యసభ నుంచి 24 మంది సభ్యులను సస్పెండ్‌ చేసారు. బుధవారం సైతం సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం మరో రాజ్యసభ ఎంపీపై వేటు పడిరది. అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో..ఇంత మంది సభ్యులను సస్పెండ్‌ చేయటం పైన విపక్షాలు నిరసన వ్యక్తం చేసాయి. కండీషన్లకు ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పాయి. సస్పెన్షన్‌కు నిరసనగా రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రంతా వారు ఆరు బయటే నిద్రించారు.గత రెండు రోజుల్లో సస్పెన్షన్‌కు గురైన 20 మంది ఎంపీల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్‌ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు. అటు విపక్ష నేతలు రాజ్యసభ ఛైర్మన్‌ తోనూ సంప్రదింపులు చేస్తున్నారు. కానీ, ఛైర్మన్‌ మాత్రం చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్‌ తొలగిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. 10 మంది నేతలు పాల్గొన్న ఈ భేటీలో ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని నేతలు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. ఇక, పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img