Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు

బుధవారం 2,067 కేసులు నమోదు… మంగళవారం కన్నా 66శాతం అధికం
న్యూదిల్లీ: దేశంలో కరోనా క్రమంగా పెరుగుతోంది. కేసుల వ్యాప్తిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం 2,067 కేసులు నమోదు కాగా, 40మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం కన్నా 66 శాతం అధికమని తెలిపింది. 480 యాక్టివ్‌ కేసులు ఉండగా, మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,340కి చేరుకున్న పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీ సహా ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాంలలో కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కు ధరించడం తప్పనిసరని తెలిపింది. దిల్లీలో 632 కేసులు నమోదు కాగా, వారం ప్రారంభంలో 7.72గా ఉన్న పాజిటివిటీ రేటు 4.42 శాతానికి తగ్గింది. మహారాష్ట్రలో 137 కేసులు నమోదు కాగా, కరోనాతో ముగ్గురు మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img