Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

గత 12ఏళ్లుగా సెలవు తీసుకోని.. స్కూల్‌ మాష్టారు

మనం చేసేది ఏ పని అయినా సరే.. వీక్‌ ఆఫ్‌ లతో పాటు సెలవులు తీసుకోవడం మామూలే..సంస్థలు ఇచ్చే సెలవులతో పాటు మన అవసరాలకి అదనంగా కూడా సెలవులు తీసుకుంటూ ఉంటాం. అయితే ఓ మాస్టారు మాత్రం గత 12సంవత్సరాలుగా ఒక్క సెలవు కూడా పెట్టకుండా స్కూల్‌ కి హాజరయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురయినా కూడా ఏనాడు ఆయన విధులకి డుమ్మా కొట్టలేదట. కాగా తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండ సమీపంలోని కారైక్కురిచ్చి మాస్టారు కలైయరసన్‌ ఘనత ఇది. సింతామణి గ్రామానికి చెందిన ఆయన కారైక్కురిచ్చి గ్రామంలోని హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img