Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

గాంధీజీపై వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్‌ అరెస్టు

జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తూ, గాడ్సేపై ప్రశంసలు కురిపించిన స్వామీజీ కాళీచరణ్‌ మహరాజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయనను రాయ్‌పూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం చత్తీస్‌గఢ్‌కు తీసుకెళుతున్నారు. రాయ్‌పూర్‌లోని రావణ్‌ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మ సంసద్‌లో కాళీచరణ్‌ మహరాజ్‌ మాట్లాడుతూ, రాజకీయాల ద్వారా దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యమని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు తాను వందనం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై రాయ్‌పూర్‌ మాజీ మేయర్‌ ప్రమోద్‌ దూబే ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు రాయ్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ప్రశాంత్‌ అగర్వాల్‌ చెప్పారు. వివిధ వర్గాల మధ్య విద్వేషం, శత్రుత్వాలను ప్రోత్సహించడం, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్యలకు పాల్పడటం వంటి నేరారోపణలను కాళీచరణ్‌పై నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img