Monday, March 27, 2023
Monday, March 27, 2023

గుజరాత్‌ తీరంలో కలకలం.. చొరబడ్డ 11 పాక్‌ పడవలు..

రంగంలోకి ఎయిర్‌ఫోర్స్‌
గుజరాత్‌ తీరంలోని సర్‌ క్రీక్‌ వద్ద పాకిస్థాన్‌కు చెందిన 11 పడవలు భారత ప్రాదేశిక జలాల్లోకి చొరబడటంతో బీఎస్‌ఎఫ్‌ స్వాధీనం చేసుకొంది.. హరామీ నాలా వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఒక డ్రోన్‌ కెమెరాను ప్రయోగించి ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 11 పాకిస్థాన్‌ పడవలను గుర్తించిన అధికారులు.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దీంతో ఈ పడవల ద్వారా పాక్‌ నుంచి భారత్‌లోకి ఎవరైనా ప్రవేశించారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందని బీఎస్‌ఎఫ్‌ ఐజీ జీఎస్‌ మలిక్‌ పేర్కొన్నారు. రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాకిస్థానీలు దాక్కునే అవకాశం ఉన్న ప్రదేశాలను బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. దీంతో వైమానిక దళానికి చెందిన మూడు కమాండో బృందాలను వేర్వేరు చోట్ల మోహరించారు. గురువారం రాత్రి కూడా ఈ ఆపరేషన్‌ కొనసాగించారు. విపరీతమైన చిత్తడి నేలలు, మడ అడవులు, ఆటు-పోట్లు కారణంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కఠినంగా మారినట్లు అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img