Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాసిక్‌- షిరిడీ హైవేపై ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీసి.. వారి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తీవ్రగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది మంది మృతుల్లో ఏడుగురు మహిళలున్నట్టు తెలుస్తోంది. కాగా.. 17 మంది ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. అయితే.. గాయపడిన వారందరినీ సిన్నార్‌లోని రూరల్‌ ఆస్పత్రికి, మరికొందరిని స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదం అతివేగంతో జరిగిందా.. లేదా పొగ మంచు కమ్ముకోవటం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img