పెగాసస్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని రాహుల్‌గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదన్నారు. కీలక అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా తాము ఇవాళ ఢల్లీిలోని జంతర్‌మంతర్ వద్ద రైతులతో కలిసి ఆందోళన చేస్తున్నామన్నారు.అదేవిధంగా పెగాసస్ అంశంపై కూడా పార్లమెంటులో చర్చ జరుగాల్సిందేనన్నారు. కాగా, ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ త్రోసిపుచ్చారు. ప్రతిపక్షాలే రైతుల సమస్యలపై చర్చకు సుముఖంగా లేవని విమర్శించారు. వాళ్లు కేవలం మీడియాలో కనిపించాలనే తపనతోనే వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారన్నారు.