Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

చిత్రదుర్గ మఠాధిపతి ఆత్మహత్య..


చిత్రదుర్గ మురుఘా మఠాధిపతి, గురు మడివళేశ్వర మఠం పీఠాధిపతి బసవ సిద్దలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. తన పేరును లైంగిక కుంభకోణంలోకి లాగడం బాధాకరమని, కర్ణాటకలోని బెలగావి జిల్లా నెగినాహల గ్రామంలోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.చిత్రదుర్గ మఠంలో మహిళలు, బాలికలు ఎలా లైంగిక దోపిడీకి గురవుతున్నారో చర్చిస్తూ ఇద్దరు మహిళల మధ్య జరిగిన సంభాషణతో కూడిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇద్దరు మహిళలు బసవ సిద్దలింగ స్వామీజీ పేరును వారి చర్చలో ప్రస్తావించారు. నిన్న ఆయన ఈ విషయమ్మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి వరకు భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. తనకు బతకాలని లేదని, పరువు, ప్రతిష్టలు మంటగలిసిన తర్వాత ఈ బతుకు వ్యర్థమని భక్తులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇవాళ (సోమవారం) ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే పోలీసులు ఆయన మరణానికి గల కారణాలను మాత్రం ఇంకా వెల్లడిరచలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img