Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

చోళుల కాలంలో హిందూమతమే లేదు- కమల్‌ హాసన్‌

మణిరత్నం తాజాగా నిర్మించిన పాన్‌ ఇండియా మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌ 1 తమిళనాట సంచలనాలు రేపుతోంది. ఇప్పటికే భారీ కలెక్షన్లతో కోలీవుడ్‌ లో దుమ్మురేపుతున్న ఈ చిత్రం అంతే స్ధాయిలో వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో చోళుల గొప్పతనాన్ని చాటుతూ మణిరత్నం వారిని ఆకాశానికెత్తేశారు. దీంతో ఇప్పుడు చోళుల గురించిన చర్చ పెరుగుతోంది. ఇందులో భాగంగానే చోళుల కాలంలో హిందూమతమే లేదన్న చర్చ కూడా జరుగుతోంది.రాజరాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడైన వెట్రిమారన్‌ ఓ వివాదానికి తెరదీశారు. దీనికి కొనసాగింపుగా చోళుల కాలంలో అసలు హిందూమతమే లేదంటూ దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. వెట్రిమారన్‌ వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న తరుణంలోననే ఆయన్ను సమర్ధించేలా కమల్‌ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img