Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్‌లోని కన్హాయిగూడ` గోపాండ్‌ జిల్లాలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే సుక్మా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బలగాలను గమనించిన మావోలు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img