జమ్మూకశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.జిల్లా క్రాల్ పొరా చాదూరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మరణించిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు. మరణించిన ఉగ్రవాదుల నుంచి ఏకే 56 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని ఐజీ వివరించారు.