Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

జమ్మూలో మళ్లీ డ్రోన్‌ కదలికలు

జమ్మూకశ్మీర్‌లో సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలో నాలుగు చోట్ల డ్రోన్‌ కదలికలను గుర్తించామని సాంబ ఎస్‌ఎస్‌పీ రాజేశ్‌ శర్మ తెలిపారు. స్థానికులు లైట్లు మెరవడం చూసి సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించడంతో వెంటనే బలగాలు భద్రతా చర్యలు చేపట్టాయి. తాజా డ్రోన్ల సంచారంపై భద్రతా బలగాలు ఇప్పటికీ స్పందించలేదు. ఇటీవల కాలాచక్‌ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను భద్రతా దళాలు కూల్చివేశాయి.జమ్మూలోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై డ్రోన్ల దాడి అనంతరం అప్రమత్తమైన బలగాలు లోయతో పాటు జమ్మూలో బలగాలు నిఘా పెంచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img