Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

జలియన్‌వాలా బాగ్‌ స్మారకానికి నూతన హంగులు

నేడు ప్రారంభించనున్న ప్రధాని
స్వాతంత్య్రోద్యమకాలంలో పంజాబ్‌లో జరిగిన వివిధ ఘటనలకు గుర్తుగా పేరొందిన చారిత్రక ప్రాంతం జలియన్‌ వాలాబాగ్‌ స్మారకం. ఇప్పుడు నూతన హంగులను సంతరించుకుంది. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. జ్వాలా స్మారకానికి మరమ్మతులు చేయడంతో పాటు, పలు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ‘లిలీ తలాబ్‌’ను అభివృద్ధి చేయడంతో పాటు రహదారులను మరింత విశాలంగా మార్చారు. కొత్త హంగులు సంతరించుకున్న జలియన్‌ వాలాబాగ్‌ స్మారకాన్ని నేటి సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్మారకంలో నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img