Monday, February 6, 2023
Monday, February 6, 2023

జాతీయగీతాన్ని మరిచిపోయిన ఎంపీ..

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఓ ప్రజాప్రతినిధి జాతీయగీతాన్ని మర్చిపోయిన ఘటన మొరాదాబాద్‌లో ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవంలో చోటుచేసుకుంది. సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ హసన్‌ స్థానిక గల్‌ షహిద్‌ పార్కులో ఆదివారం జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన జాతీయ గీతం ‘జన గణ మన’ పూర్తిగా పాడలేకపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో బీజేపీ నేత సాంబిత్‌ పాత్రా తన ట్విట్టర్లో షేర్‌ చేశారు. ఎంపీ హసన్‌తో బాటు ఆయన పార్టీ నేతలు, మద్దతుదారులు కూడా ఈ గీతాన్ని పాడలేకపోయారని, మన నేతల పరిస్థితి ఇలా ఉందని పాత్రా ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img