రాజధాని దిల్లీలోని ఇండియాగేట్ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవన్ జ్యోతికి స్థాన చలనం కలిగింది. ఈ జ్యోతిని అమర్ జవాన్ల స్మారకానికి 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేశారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ పర్యవేక్షణలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సైనిక లాంఛనాల నడుమ ఈ ఘట్టం పూర్తయ్యింది.