Friday, December 2, 2022
Friday, December 2, 2022

జీతాలు పెంచడం కష్టమైనా సమీక్షిస్తాం: ఇండిగో

న్యూదిల్లీ: జీతాలు పెంచడం చాలా కష్టమైన పని అని, అయితే ఇండిగో తన లాభదాయక, పోటీ వాతావరణం ఆధారంగా వేతనాలను నిరంతరం సమీక్షిస్తుందని, సర్దుబాటు చేస్తుందని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీఈవో రోన్‌జోయ్‌ దత్తా శుక్రవారం తెలిపారు. కోవిడ్‌`19 సందర్భంగా తమ జీతాలను తగ్గించినందుకు నిరసనగా మంగళవారం నుంచి సమ్మె చేపట్టనున్న ఐదుగురు పైలెట్లను ఇండిగో సోమవారం తొలగించింది. దీనిపై శుక్రవారం సీఈవో దత్తా స్పందిస్తూ జీతాలు ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది చాలా క్లిష్టమన సమస్య. కానీ పోటీ వాతావరణంలో వేతన నిర్మాణాన్ని పరిగణన, కంపెనీ లాభదాయకతను పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ వాతావరణంలో జీవన వేతనాన్ని సాధించేందుకు యత్నిస్తున్న ఉద్యోగులకు ఈ విషయం చెప్పాలని తాను భావిస్తున్నానన్నారు. ఈ సంస్థ విజయానికి ఉద్యోగుల సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి, ఈ అంశాలన్నింటి మధ్య సరైన సమతౌల్యతను సాధించడం అంత తేలికైన పనికాదు. అయితే ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా విమానయాన సంస్థల అభివృద్ధి చెందుతున్నందున తప్పకుండా నిరంతరం వేతనాలను సమీక్షిస్తూ ఉద్యోగులకు న్యాయం చేస్తామని దత్తా వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img