Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

టీకాలో వెనుకబడ్డ ప్రాంతాలెన్నో

ప్రజల్లో భయం`సందేహాలు
ఆదర్శంగా నిలిచిన మహే జిల్లా

న్యూదిల్లీ : కొవిడ్‌ కట్టడికి ఏకైక అస్త్రంగా ఉన్న టీకా ప్రతి పౌరునికి అందేలా చేయడం పెద్ద సవాల్‌గా ఉంది. 1.4 బిలియన్ల జనాభాకు టీకా ఇవ్వాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ బృహత్‌ కార్యం ఆర్భాటంగా మొదలైనా కాలం గడిచే కొద్దీ నీరుగారిపోయింది. అంతా సజావుగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పినాగానీ రాష్ట్రాలను వాక్సిన్‌ కొరత వేధించింది. జనవరి 16న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 60ఏళ్లుపై బడినవారికి టీకాలు ఇవ్వడం మొదలైంది. మే నెల వచ్చేసరికి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అప్పటికే టీకా కొరత దేశంలో ఉంది. రెండవ దశ వైరస్‌ విజృంభణ సమయంలో డిమాండు మరింత పెరిగింది. ప్రణాళిక, మౌలిక వసతుల నుంచి తప్పుడు సమాచారం వరకు ఇలా పలు అంశాలతో వివిధ ప్రాంతాల్లో వాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతం అయింది. 729 జిల్లాల డేటా ప్రకారం టీకాల రేటులో వ్యత్యాసం కనిపించింది. కొన్ని జిల్లాలు తమ జనాభాలో సగానికి వాక్సిన్‌ ఇస్తే మరికొన్ని జిల్లాలు మూడు శాతం మందికే వాక్సిన్‌ ఇవ్వగలిగాయి. టీకా పంపిణీ విషయంలో కొన్ని పట్టణ ప్రాంతాలు, తక్కువ జనాభాగల జిల్లాలు పెద్ద జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల కంటే మెరుగ్గా వ్యవహరించాయి. కొన్ని జిల్లాలు ముందుంటే మరికొన్ని వెనకబడ్డాయి.
ప్రణాళికే కీలకం…
నైరుతిలోని చిన్న జిల్లా మాహే… వాక్సినేషన్‌లో భేష్‌ అనిపించింది. ఈ జిల్లా బాధ్యతలను శివరాజ్‌ మీనా ఫిబ్రవరిలో చేపట్టినప్పుటికే ఆయన జిల్లాలోని 31వేల జనాభాకు టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలతో వచ్చారు. టీకా తీసుకోవడానికి జిల్లా ప్రజలు భయపడుతున్నట్లు ఆయన గమనించారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల ఈ జిల్లాలో ఆరోగ్య మౌలికవసతులు పరిమితంగా ఉండటంతో మీనా ఓ ప్రణాళికను రూపొందించారు. రాజకీయ నాయకులు, మతసంఘ పెద్దలతో సమావేశమై టీకాల సామర్థ్యాన్ని వివరించారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఇప్పటికే వాక్సిన్‌ టీకా తీసుకున్నారని, వారిలో ఎటువంటి దుష్ప్రభావం లేదని, కొద్ది మందిలో రియాక్షన్లు స్వల్పంగా కనిపించిందని ఆయన చెప్పారు. ఇంటింటికి వాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకున్నారు. హెల్త్‌ వర్కర్లు, నర్సులు, టీచర్లతో 30 బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి కౌనెల్సింగ్‌ ఇప్పించారు. టీకా కోసం పేర్ల నమోదు, వాక్సినేషన్‌ టోకెన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఈ వ్యూహం ఫలించింది. మాహేలో 53శాతం మందికిపైగా తొలి డోసు టీకాను తీసుకున్నారు. వాక్సిన్‌ డ్రైవ్‌లో విజయవంతమైంది. సమస్యను గుర్తిస్తేనే దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనవచ్చునని మీనా వెల్లడిరచారు. వాక్సిన్‌పై ప్రజల్లో అనుమానాలు... భయం అసోంలోని మారుమూల దక్షిణ సల్మారా మంకచర్‌ ప్రజలు వాక్సిన్‌ పేరు వింటేనే వణికిపోయారు. దానిపై అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. కాబట్టి వాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఈ జిల్లా వెనుకబడిరది. బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి ఈ గ్రామాల్లో మూడు శాతం మంది మాత్రమే కొవిడ్‌ టీకా పొందారు. వాక్సిన్‌ తీసుకొని జనం చనిపోతున్నారని తెలిసి తనలాంటి చాలా మంది టీకా తీసుకోలేదని స్థానిక రైతు మనోవర్‌ ఇస్లాం మొండల్‌ అన్నారు. బీజేపీ అధికారంలో ఉండటం, కాషాయ వర్గానికి ముస్లిములంటే గిట్టకపోవడం కూడా ఈ వైఫల్యానికి కారణమని ఇక్కడి మహమ్మదీయులు చెబుతున్నారు. వాక్సినేషన్‌ డ్రైవ్‌ వెనుక తమకు చెడు చేయాలన్న బీజేపీ కుట్ర దాగి ఉందని భయపడ్డారు. ముస్లిం ఓట్లు అక్కరలేదని మీడియాలో ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ ప్రకటించడంతో ముస్లింలలో భయాన్ని పెంచింది. తామంటేనే గిట్టనప్పుడు ఉచితంగా వాక్సిన్‌ ఇస్తూ ప్రేమ ఒలికిపోయడం వెనుక మర్మమేమిటి? అని ముస్లింలు ప్రశ్నించారు. కాబట్టే ఎవ్వరూ టీకా తీసుకోవడానికి ముందుకు రాలేదు. స్థానికుల్లో భయం ఒక్కటే కనిష్ట వాక్సినేషన్‌కు కారణం కాదని, ఇది కొండ ప్రాంతం కావడంతో జనం కొండెక్కి వాక్సిన్‌ కేంద్రాలకు రావడానికి ఇష్టపడలేదని డిప్యూటీ కమిషనర్‌ హైవ్‌ నిసంగ్‌ గౌతం అన్నారు. ఇదిలావుంటే తమిళనాడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 46శాతం జనాభాకే టీకాలు ఇచ్చారు. అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన తిరువన్నమలై వాక్సినేషన్‌లో విఫలమైన జిల్లాల జాబితాలో ఉంది. ఎన్నికల వేళ కరోనా వైరస్‌, వాక్సినేషన్‌ను పట్టించుకోలేదని, టీకా తీసుకోవాలస్న ఆవశ్యకత అనిపించలేదని లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్‌ ఒకరు అన్నారు. ఇంకొందరు టీకాలపై భయం వ్యక్తంచేశారు. టీకా తీసుకొని ప్రముఖ నటుడు మరణించిన దృష్ట్యా స్థానికుల్లో ఈ భయం నెలకొంది. ఇంటికే పరిమితమయ్యాను. కాబట్టి టీకా తీసుకోలేదు. అవసరమనిస్తే తీసుకుంటానని ఓ రైతు అన్నారు. గ్రామీణ ప్రజలకు వాక్సిన్‌ పెనుసవాల్‌గా మారిందని జిల్లా ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అజిత వెల్లడిరచారు.
దక్షిణ దిల్లీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. దిల్లీలోని 11 జిల్లాలోనే తక్కువ జనాభా/ ఎక్కవ మంది ధనవంతులు ఉండే ఈ ప్రాంతంలో టీకా పండుగ జరిగింది. 1.1 మిలియన్‌ జనాభాలో 43శాతం మంది మొదటి మోతాదును తీసుకున్నారు. కొవిడ్‌ వాక్సిన్‌ కొరత కారణంగా వాక్సినేషన్‌ బుక్లింగ్‌ అన్నది ‘ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌’గా మారిందని 27ఏళ్ల మహిమా గులాటి అన్నారు. తనతో తన సోదరుడు, మరికొందరు స్నేహితుల కోసం స్లాట్‌ను బుక్‌ చేసిన ఆమె తమ ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో వాక్సిన్‌ పొందగలగడం అదృష్టంగా వర్ణించారు. వాక్సినేషన్‌ కేంద్రంలో మంచి ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. మిగతా జిల్లాల కంటే దక్షిణ దిల్లీలో వాక్సినేషన్‌ ఎక్కువగా జరగడానికి మెరుగైన ఆరోగ్య మౌలికవసతులే కారణమన్నారు.దేశమంతటా ఇటువంటి ఏర్పాట్లు ఉండటం మహమ్మారి వేళ ఎంతైనా అవసరమని నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img