Monday, August 8, 2022
Monday, August 8, 2022

టెలికాం రంగంలోకి అడుగుపెట్టనున్న అదానీ..

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 26న ప్రారంభం కానున్న 5జీ టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో అదానీ గ్రూప్‌ కూడా పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అదానీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే, బిడ్డింగ్‌ దరఖాస్తుదారుల వివరాలను టెలికాం శాఖ ఈ నెల 12న విడుదల చేశాక పూర్తి స్పష్టత రానుంది. వేలంలో పాల్గొనేందుకు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, సునీల్‌ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్‌, కుమార మంగళం బిర్లా భాగస్వామిగా ఉన్న వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ గ్రూప్‌ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో 5జీ సేవల్లో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాకు అదానీ నుంచి గట్టిపోటీ ఎదురుకావచ్చు. అదానీ గ్రూప్‌ ఈమధ్యనే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా దక్కించుకుంది. ఈసారి రూ.4.31 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు టెలికాం శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img