Monday, October 3, 2022
Monday, October 3, 2022

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి సర్జరీ చేసిన డాక్టర్‌

డాక్టర్లు… దేవుళ్లతో సమానం అంటుంటారు. చావు బతుకుల్లో ఉండే మనుషులను రక్షించే సామర్థ్యం వారి చేతుల్లో మాత్రమే ఉంటుంది. అందుకే సమాజంలో వైద్యులకు అంత ప్రాముఖ్యత, గౌరవం ఉంటాయి. తాజాగా తన వృత్తి పట్ల ఉన్న కమిట్‌మెంట్‌తో ఓ డాక్టర్‌ చేసిన పని గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరీ ఆ డాక్టర్‌ పేషంట్‌ కోసం అంత గొప్ప పని చేశారు. కొద్ది సేపట్లో ఓ వ్యక్తికి ఆపరేషన్‌ చేయాల్సిన డాక్టర్‌.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. సాధారణంగా ఇంకేవరైనా ఆపరేషన్‌ను పోస్ట్‌పోన్‌ చేస్తారు. ఆలస్యమైనా ఫర్వాలేదులే చేద్దాం అనుకుంటారు. కానీ బెంగళూరులో ఓ డాక్టర్‌ అలా అని ఊరుకోలేదు. తన వల్ల పేషంట్‌ ఆపరేషన్‌కు ఆలస్యం అవుతుందని భావించి మూడు కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికికు వెళ్లిన వెంటనే రోగికి శస్త్ర చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఇది తెలుసుకున్న జనం ఆ డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఆగస్ట్‌ 30న జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే, సర్జాపూర్‌లో ఉన్న మణిపాల్‌ హాస్పిటల్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా చేస్తున్న డాక్టర్‌ గోవింద్‌ నందకుమార్‌ ఆగస్టు 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఓ మహిళకు గ్యాల్‌బాడర్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన ఆ డాక్టర్‌ ఫుల్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. సర్జరీకి లేట్‌ అవుతుందేమో అన్న కంగారులో.. ఆ డాక్టర్‌ మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు. డ్రైవర్‌కే కారును వదిలేసిన ఆ డాక్టర్‌.. శరవేగంగా హాస్పిటల్‌కు చేరుకుని సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేశారు. పేషెంట్‌ ఆరోగ్యంగా ఉన్నారని, షెడ్యూల్‌ ప్రకారమే డిశ్చార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img