Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

డిసెంబరులో 15శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

న్యూదిల్లీ: వస్తువులుసేవల పన్ను (జీఎస్టీ) 2022 డిసెంబరులో 15శాతం పెరిగి రూ.1.49 లక్షలకోట్లకుపైగా నమోదైంది. ఉత్పత్తి, వినియోగ డిమాండు మెరుగుదలను ఈ పెంపు సూచిస్తున్నది. వరుసగా పదో నెలలో రూ.1.40లక్షల కోట్లకుపైగా పన్ను ఆదాయం వచ్చింది. నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.46లక్షల కోట్లు కాగా స్థూల జీఎస్టీ ఆదాయం 2022 డిసెంబరులో రూ.1,49,507 కోట్లు అని ఆర్థికశాఖ ప్రకటన తెలిపింది. ఇందులో నుంచి రూ.26,711 కోట్లు సీజీఎస్టీ కాగా రూ.33,357 కోట్లు ఎస్‌జీఎస్టీ, రూ.78,434 కోట్లు (దిగుమతి వస్తువులపై రూ.40,263కోట్లు కలిపి) ఐజీఎస్టీ, సెస్‌ రూ.11,005 కోట్లు (దిగుమతి వస్తువులపై వసూలైన రూ.850కోట్లు సహా) అని పేర్కొంది. డిసెంబరులో దేశీయ జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని, గతేడాది ఇదే నెలలో రూ.1.30లక్షల కోట్లు వసూలైనట్లు ప్రకటన తెలిపింది. ఈనెలలో దిగుమతి వస్తువులపై ఆదాయం ఎనిమిది శాతం అధికం కాగా దేశీయ లావాదేవీలు (దిగుమతి సేవలు సహా) 18శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 2022 నవంబరులో 7.9కోట్లు ఈవే బిల్లులు జనరేట్‌ కాగా అక్టోబరులో 7.6 కోట్లు ఈ`వే బిల్లులు జారీ అయ్యాయని ప్రకటన వెల్లడిరచింది. ఇదిలావుంటే, ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు నమోదైంది. రూ1.68లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే మేలో రూ.1.41లక్షలకోట్లు రాగా జూన్‌లో రూ.1.45లక్షలకోట్లు, జులైలో రూ.1.49 లక్షలకోట్లు, ఆగస్టులో రూ.1.44లక్షల కోట్లు, సెప్టెంబరులో రూ.1.48 లక్షలకోట్లు, అక్టోబరులో రూ.1.52లక్షలకోట్లు, నవంబరులో రూ.1.46లక్షల కోట్లు, డిసెంబరులో రూ.149లక్షల కోట్లు చొప్పున వసూళ్లు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img