Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు

ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
జనవరి 30న శ్రీనగర్ లో ప్రసంగం

ఢిల్లీ పోలీసులు నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి ఆదివారం వేకువజామున వెళ్లారు. లా అండ్ ఆర్డర్ స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసులు అందించారు.భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్ లో మాట్లాడుతూ, సుదీర్ఘపాదయాత్రలో తనను అనేకమంది మహిళలు కలిశారని, వారిలో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన వారు ఉన్నారని అన్నారు. ఈ అంశంపైనే ఢిల్లీ పోలీసులు రాహుల్ కు నోటీసులు ఇచ్చారు. ఁమీరు చెబుతున్న ఆ అత్యాచారాలకు గురైన మహిళల వివరాలు మాకు అందించండి. వారికి మేం న్యాయం చేస్తాంఁ అని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.అందుకు రాహుల్ స్పందిస్తూ, తనకు కొంత సమయం కావాలని, తాను పాదయాత్రలో ఎంతోమందిని కలిశానని, వారిలో కొందరి వివరాలు ఇచ్చేందుకు సమయం పడుతుందని పోలీసులకు బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img