Monday, January 30, 2023
Monday, January 30, 2023

తనపై విమర్శల దాడిని ఖండిరచాలని స్పీకర్‌కు థరూర్‌ వినతి

న్యూదిల్లీ : లోక్‌సభలో జరిగిన చర్చలో బీజేపీ సభ్యుడు నిశికాంత్‌ దూబే తనపై చేసిన వ్యక్తిగత విమర్శల దాడిని ఖండిరచాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ గురువారం డిమాండ్‌ చేశారు. ఇకమీదట ఎవరైనా సభ్యుడు ఇతర సభ్యులపై ఇటువంటి దాడి చేయకుండా చూసుకోవాలని జీరో అవర్‌లో స్పీకర్‌ ఓం బిర్లాను ఆయన అభ్యర్థించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లు, 2021పై తాను చేసిన వ్యాఖ్య సందర్భంగా దూబే పార్లమెంటు ప్రక్రియ, మర్యాదలను ఉల్లంఘించారని థరూర్‌ పేర్కొన్నారు. అతనిపై కేసు పెండిరగ్‌లో ఉన్నందున చర్చలో పాల్గొనకూడదని దూబే వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన వ్యాఖ్యకు తాను చింతిస్తున్నానని అన్నారు. ఈ చర్యను స్పీకర్‌ ఖండిరచాలని థరూర్‌ డిమాండ్‌ చేశారు. బిర్లా స్పందిస్తూ పార్లమెంటరీ విధి విధానాలు, నిబంధనలను పాటించాలని సభ్యులను కోరారు. అనంతరం థరూర్‌ వ్యాఖ్యపై నిశికాంత్‌ దూబే స్పందిస్తూ.. ఆ రోజు చర్చ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, న్యాయస్థానంలో పెండిరగ్‌లో ఉన్న కేసులపై మాట్లాడకుండా ఉండమని చైర్‌ ద్వారా థరూర్‌ను కోరుతూ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img