త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన బొర్డోవాలి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. కాగా, ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం ఓట్లు నమోదయ్యాయి.