Monday, January 30, 2023
Monday, January 30, 2023

దావూద్‌ కరాచీలోనే ఉన్నాడు..

టెర్రర్‌ ఫండిరగ్‌ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎన్‌ఐఏ వివరణ
అండర్‌ వరల్డ్‌ డాన్‌, పరారీలో ఉన్న గ్యాంగ్‌ స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌ లోని కరాచీలోనే ఉన్నాడని మరోమారు స్పష్టమైంది. దావూద్‌ ఇబ్రహీం మేనల్లుడు అలిషాప్‌ా పార్కర్‌ ఈ వివరాలను వెల్లడిరచినట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) పేర్కొంది. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ కొడుకే ఈ అలీషాప్‌ా పార్కర్‌. అంతేకాదు, పాకిస్థానీ పఠాన్‌ మహిళను దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు పార్కర్‌ చెప్పాడు. ఈ పెళ్లి కోసం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు దావూద్‌ చెబుతున్న మాటలు నిజంకాదని వివరించాడు. దావూద్‌ కరాచీలోనే ఉన్నాడని, కాకపోతే నివాసాన్ని వేరే ఇంటికి మార్చాడని పార్కర్‌ పేర్కొన్నాడు. ఈమేరకు టెర్రర్‌ ఫండిరగ్‌ కేసులో విచారణ జరిపిన ఎన్‌ఐఏ అధికారులు అలీషాప్‌ా పార్కర్‌ ను గతంలోనే ప్రశ్నించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ ను అధికారులు దాఖలు చేశారు. అందులో అలీషాప్‌ా వెల్లడిరచిన వివరాలను పొందుపరిచారు. కరాచీలోని డిఫెన్స్‌ కాలనీలో ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని పార్కర్‌ చెప్పాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img