Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

దిల్లీలో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీగా మందుగుండు సామాగ్రి, 2 వేల కాట్రిడ్జ్‌లను (తూటా)స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దేశ రాజధానిలో ఆనంద్‌ విహార్‌లో రెండు సంచుల తూటాలతో అరెస్టు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత్‌ సిద్ధమౌతున్న నేపథ్యంలో ఢల్లీిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు పెట్రోలింగ్‌, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img