Friday, December 9, 2022
Friday, December 9, 2022

దిల్లీలో హైఅలర్ట్‌

ఆగస్టు 15 వరకు ఎర్రకోట మూసివేత
ఉగ్రదాడి జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. చారిత్రక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేయడంతోపాటు ఆంక్షలు విధించారు. జులై 21 నుంచి ఆగస్టు 15 వరకు ఎర్రకోటను మూసివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది.ఎర్రకోట చుట్టూ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తున్నాయి. కాగా, ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img