దిల్లీలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న తరహాలోనే పంజాబ్‌లో కూడా బడ్జెట్ రూపొందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.బడ్జెట్ తయారు చేయడానికి ముందు సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా ట్రేడర్లు, వాణిజ్యవేత్తలు, రైతులు, శ్రామికులు, మహిళలు, యువకులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే బడ్జెట్ రూపకల్పన చేస్తామన్నారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం బడ్జెట్‌లో ఉంటుందని చెప్పారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త పన్నులేవీ విధించేది లేదని హామీ ఇచ్చారు.