Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

దివ్యాంగ చిన్నారికి ‘ఇండిగో’లో అవమానం

కేంద్రమంత్రి సింధియా ఆగ్రహం
న్యూదిల్లీ: ఓ దివ్యాంగ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి రానివ్వని ఘటన రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి బాగా భయపడుతుండటంతో అతని ప్రయాణానికి నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇండిగోపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం గత శనివారం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని, దానివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది చాలా అమానవీయ ఘటన అని రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు ఇండిగోపై విమర్శలు గుప్పించారు. దీనిపై విమానయాన సంస్థ స్పందించింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం దాకా సిబ్బంది వేచి చూశారని, కానీ ఫలితం లేకపోయిందని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. అనంతరం ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా..ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది. ఆదివారం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరినట్లు తెలిపింది. ఉద్యోగులైనా, ప్రయాణికులైనా అందరినీ కలుపుకొని వెళ్లే సంస్థ ఇండిగో. ప్రతినెలా తమ విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారని ఆ సంస్థ పేర్కొంది.
ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని, ఏ వ్యక్తికీ ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదని స్పష్టంచేశారు. దీనిపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానన్నారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇండిగోను హెచ్చరిస్తూ సింధియా ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించిందని, సంబంధిత విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఘటనపై సీఈఓ ఆగ్రహం
దివ్యాంగ చిన్నారిని ఎక్కేందుకు నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీరుపై ఆ సంస్థ సీఈవో రోనోజోయ్‌ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘనటపై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్‌ వీల్‌ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను. అని అన్నారు. దాడుల్లో భాగంగా దావూద్‌ అనుచరుడు సలీమ్‌ ఫ్రూట్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img