Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

దీపావళి కల్లా 5 జీ సేవలు : ముఖేశ్‌ అంబానీ

ఇటీవలే దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పూర్తికావడం తెలిసిందే. ఎంతో విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న టెలికాం దిగ్గజాల్లో రిలయన్స్‌ జియో కూడా ఉంది. కాగా, ఈ ఏడాది దీపావళి నాటికి జియో ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్‌ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్వర్క్‌ ను తీసుకువస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ అంబానీ వెల్లడిరచారు.ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు (సోమవారం) వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) జరిగింది. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్‌ వర్క్‌ గురించి అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్వర్క్‌ ను తీసుకువస్తున్నామని ముఖేశ్‌ అంబానీ వెల్లడిరచారు. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల సహా ప్రధాన నగరాలన్నింటిలో ఈ ఏడాది 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక, 2023 డిసెంబరు నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి తాలూకా, ప్రతి మండలంలోనూ 5జీ సేవలు అందిస్తామని అంబానీ వివరించారు. రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ స్పందిస్తూ… ‘‘5జీలో లేటెస్ట్‌ వెర్షన్‌ అయిన స్టాండ్‌ ఎలోన్‌ 5జీతో వినియోగదారుల ముందుకువస్తున్నాం. పాన్‌ ఇండియా స్థాయిలో నికార్సయిన 5జీ నెట్వర్క్‌ ను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. అందుకోసం జియో రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది’’ అని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img