దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి.ు. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,48,359 (0.35%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,28,81,179 కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 5,12,924 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడిరచింది.కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 30,009 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,22,19,896 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 176.52 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.