Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా నిన్న 2,51,515 నిర్ధారణ పరీక్షలు చేయగా 2,141 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,36,517 చేరింది. ప్రస్తుతం దేశంలో 25,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 20 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,943కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img