Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

దేశంలో కొత్తగా 3,688 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా మూడు వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దాంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం కేంద్రం వెల్లడిరచిన గణాంకాల ప్రకారం, తాజాగా 3,688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢల్లీిలోనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2755 మంది కోలుకోగా, 50 మంది మృతిచెందారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరిందని చెప్పింది. 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,88,89,90,935 వ్యాక్సిన్‌ డోసులు పంపినీ చేశామని, ఇందులో నిన్న ఒక్కరోజే 22,58,059 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img