Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా 8,413 కొత్త కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయి. మొన్నటితో పోలిస్తే కేసులు భారీగా తగ్గడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 15,040 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో మొత్తం 4,42,77,194కు చేరింది. ఇందులో 4,36,38,844 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం 5,27,098 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 4.15శాతం ఉన్నది. దేశంలో ఇప్పటి వరకు 208.31కోట్ల టీకా డోసులను పంపిణీ పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img