Friday, June 9, 2023
Friday, June 9, 2023

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. 60 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 10 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226 కి చేరింది. ఇక యాక్టివ్‌ కేసులు 60 వేల మార్క్‌ను దాటాయి. ప్రస్తుతం 60,313 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,42,35,772 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఆరుగురు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ (మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img