Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణకాగా, తాజాగా ఆ సంఖ్య 2,897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,157 మంది మరణించగా, 19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 54 మంది మరణించగా, 2986 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. గత కొన్నిరోజులుగా మూడు వేలకు పైగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు 2 వేలకు పడిపోయాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.61 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారు, 1.22 శాతం మంది మరణించారని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,90,67,50,631 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో మంగళవారం ఒకేరోజు 14,83,878 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img