Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

దేశ రాజధానిలో మరో దారుణ ఘటన

న్యూఢల్లీి రైల్వేస్టేషన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌
నిందితులు రైల్వే ఉద్యోగులే.. అరెస్ట్‌

దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. న్యూఢల్లీి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను ఢల్లీి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు నిందితులు కూడా రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం. 30 ఏళ్ల బాధితురాలిపై గురువారం అర్థరాత్రి ఇద్దరు రైల్వే ఉద్యోగులు రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ రూమ్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 22న బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి రౖౖెల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌లోని ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది గదిలో 30 ఏళ్ల బాధితురాలు అత్యాచారానికి గురైంది. ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లోని రైల్వే ఉద్యోగులైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ రైల్వే హరేంద్ర సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img