Friday, August 19, 2022
Friday, August 19, 2022

ద్రవ్యోల్బణంపై నోరుమెదపరే..

ప్రధాని, ఆర్థిక మంత్రిని ప్రశ్నించిన సంజయ్‌ రౌత్‌
ముంబై: పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనీ, అయితే ప్రధాని నరేంద్రమోదీ గానీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గానీ ఈ విషయమై మాట్లాడడం లేదని మండిపడ్డారు. బీజేపీ జాతీయ, మహారాష్ట్ర నేతలు సైతం మౌనంగానే ఉన్నారన్నారు. పంజాబ్‌, మహారాష్ట్ర పోలీసులు ఏం చేస్తారోనని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శాంతి నెలకొన్నదని, అయితే, కొందరు నేతలు దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వారికి తగిన సమాధానం చెప్పామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img