కొట్టాయం: కేరళ నన్‌పై అత్యాచారం కేసులో బిషప్ ప్రాంకో ములక్కల్‌ను కొట్టాయం అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2018వ సంవత్సరంలో కేరళలో ఓ నన్ పై అత్యాచారం చేశాడని బిషప్ ప్రాంకో ములక్కల్ పై కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలుడిన తర్వాత ములక్కల్ కోర్టు నుంచి బయటకు వస్తూ ‘ప్రభువును స్తుతించండి’ అంటూ కోరారు. దేశంలోనే కేరళ నన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ అరెస్టు అవడం మొదటిసారి. 2014 మే5న బిషప్ కురవిలంగాడ్ కాన్వెంట్‌ని సందర్శించారని, రాత్రి తనను గదిలోకి పిలిచి తనతో అసహజ సంభోగం చేయమని బలవంతం చేశారని నన్ తన ఫిర్యాదులో పేర్కొంది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని నన్ ఆరోపించింది.