Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

నాలుగు రోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడిరచింది. రుతుపవన ద్రోణి పశ్చిమ నుంచి క్రమంగా ఉత్తరం వైపునకు మారే అవకాశం ఉందని దీని ఫలితంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. బుధవారం వరకు అసోం, మేఘాలయ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్‌ ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌ లలో భారీవర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img