Friday, August 12, 2022
Friday, August 12, 2022

నిరాడంబరంగా పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ వివాహం

హాజరైన కేజ్రీవాల్‌, రాఘవ్‌ చద్దా
పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. హర్యానాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. ఈ పెళ్లికి మాన్‌ తల్లి, సోదరి అతికొద్దిమంది కుటుంబ సభ్యులతోపాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా హాజరయ్యారు.పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్‌ మాన్‌ ఫోటోను ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img