Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

న్యాయమూర్తులకు బెదిరింపులు..దురదృష్టకరం

: సీజేఐ
జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలమైన తీర్పులు రాకుంటే న్యాయవ్యవస్థను కించపరచడం ఎక్కువైందని, ఈ ట్రెండ్‌ దురదృష్టకరమని అన్నారు. న్యాయమూర్తులు తమకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.న్యాయ వ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదన్న ఆయన జడ్జి హత్య కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు.అలాగే జడ్జిల రక్షణకు తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 17లోగా వివరాలు అందించాలని తెలిపారు.గత నెల 28న జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ దారుణహత్యకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img