Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

పంజాబ్‌కు రండి.. సర్దార్‌లు మిమ్మల్ని రక్షిస్తారు : బిల్కిస్‌ బానోకు సింగర్‌ ఆహ్వానం

బాధితురాలు బిల్కిస్‌ బానోకు అండగా ఉంటామని పంజాబ్‌ గాయకుడు రబ్బీ షెర్గిల్‌ చెప్పారు. ఆమె ఒంటరి కాదన్నారు. ఈ మేరకు బిల్కిస్‌ బానోను పంజాబ్‌కు రమ్మని ఆహ్వానించారు. తమ చివరి రక్తపు బొట్టు వరకూ ఆమెను కాపాడాతమని చెప్పారు. రబ్బీ షెర్గిల్‌.. బిల్కిస్‌ బానోపై జరిగిన ఘోరమైన సామూహిక అత్యాచారంపై ‘బిల్కిస్‌’ పాటతో దేశాన్ని ఒకప్పుడు కదిలించారు. అయితే ఆ దోషులను విడుదల చేయడంపై ఆయన స్పందించారు. బిల్కిస్‌ బానోను పంజాబ్‌కు రమ్మన్నారు. ‘‘నేను బిల్కీస్‌కి చెప్పాలనుకుంటున్నాను, పంజాబ్‌కు రండి, మా చివరి రక్తపు బొట్టుతో మేము మిమ్మల్ని రక్షిస్తాం. సర్దార్‌లు మిమ్మల్ని చూసుకుంటారు.’అని అన్నారు.అలాగే ‘‘దయచేసి న్యాయం గురించి ఆలోచించడం మొదలుపెడదాం. ఎందుకంటే మనం అలా చేయకపోతే మన సమాజాన్ని మనం ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు హీరోలు ఉండరు.’’ అని షెర్గిల్‌ పిలుపునిచ్చారు. 2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో బిల్కిస్‌ బానోపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణీ, అంతేకాదు ఆమె కుటుంబంలో ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు శిక్ష పడిరది. 15 ఏళ్లు జైల్లో ఉన్న వారిని ఇటీవల విడుదల చేశారు. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదం అయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img