Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

పక్షం రోజులకోసారి ‘పన్ను’ సమీక్ష

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూదిల్లీ : అంతర్జాతీయ ధరల ఆధారంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), డీజిల్‌, ముడి చమురుపై విధించే కొత్త పన్నులను ప్రభుత్వం ప్రతి 15 రోజులకు సమీక్షిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం తెలిపారు. ఇవి ‘అసాధారణ సమయాలు’, అంతర్జాతీయ చమురు ధరలు హద్దులు లేనివని ఆమె అన్నారు. ‘మేము ఎగుమతులను నిరుత్సాహపరచకూడద నుకుంటున్నాం. కానీ దేశీయంగా అందుబాటును పెంచాలనుకుంటున్నాం’ అని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. చమురు అందుబాటులో లేదంటే, ఎగుమతులు అసాధారణ లాభాలతో జరుగుతుంటే, మన పౌరులకు కనీసం కొంత అవసరమని అన్నారు. ‘మేము ఈ జంట కోణ విధానాన్ని అనుసరించాలి’ అని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌పై ఎగుమతి పన్నుతో పాటు దేశీయ ముడి చమరు ఉత్పత్తిపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించింది. రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ సెజ్‌ యూనిట్లపై కొత్త పన్నులు వర్తిస్తాయని, అయితే ఎగుమతి ఆంక్షలు వర్తించవని చెప్పారు. రూపాయిపై ఆర్థిక మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని, దిగుమతులపై రూపాయి విలువ ప్రభావం చూపుతుందని ప్రభుత్వం స్పృహ కలిగి ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img