Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

పటాకులపై పూర్తి నిషేధం వద్దు-కేజ్రీవాల్‌కి లేఖ రాసిన సీఎం స్టాలిన్‌

ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు . ఢల్లీిలో పటాకులను పూర్తిగా నిషేధించవద్దని, అనుమతించదగిన నిబంధన ప్రకారం.. పటాకుల అమ్మకాలను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం.. రాజధానిలో పటాకుల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని స్టాలిన్‌ కోరారు. ప్రస్తుతం ఢల్లీిలో పటాకుల అమ్మకం, ఉత్పత్తి, వినియోగంపై పూర్తి నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని శివకాశి వార్షిక ఆదాయంలో 70% దీపావళి రోజున పటాకుల అమ్మకం ద్వారా వస్తుందని స్టాలిన్‌ తెలిపారు. వారిని ఆర్థికంగా లాభపడేలా దీపావళి సందర్బంగా ఢల్లీిలో పటాకుల అమ్మకానికి అనుమతి ఇవ్వాలని స్టాలిన్‌ కోరారు. మరే ఇతర రాష్ట్రం పటాకులపై పూర్తి నిషేధం విధించనప్పుడు ఢల్లీిలో ఎందుకు అన్ని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img