Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీవర్షాలు

క్యుములోనింబస్‌ క్లౌడ్‌ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని పూణే, అహ్మద్‌ నగర్‌ ప్రాంతాల్లో వచ్చే నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనిఐఎండీ వెల్లడిరచింది. డెహ్రాడూన్‌, చంపావత్‌, పిటోరాఘడ్‌, బాగేశ్వర్‌, నైనిటాల్‌ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీవర్షాలు దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వచ్చే అయిదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోల్‌కతా, హౌరా, పశ్చిమ మిడ్నాపూర్‌, బిర్‌ భూమ్‌, ముర్షిదాబాద్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఛత్తీస్‌ ఘడ్‌, జార?ండ్‌, కొంకణ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img