Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

పశ్చిమబెంగాల్‌లో బాంబు పేలుడు..ముగ్గురు మృతి

ఓ ఇంట్లో బాంబు పేలడంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ కుమార్‌తోపాటు మరో ఇద్దరు మృతిచెందారు.మరి కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఈరోజు ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్న తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్‌ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img